అమరావతి : ఎప్పుడూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సీపీఐ నాయకుడు నారాయణ ఈ సారి ఏపీ సీఎం జగన్పై సెటైర్లు వేశారు. ‘ ఆత్మ’ ల సలహ మేరకు ఎన్టీఆర్ మెడికల్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ మెడికల్ యూనివర్శిటి పేరుగా మార్చానని చెప్పుకోవడంపై ఆయన తప్పుబట్టారు. జగన్కు ఉన్న 33 మంది సలహదారులతో పాటు ‘ఆత్మ’ను కూడా ఒక సలహా దారుడిగా నియమించుకున్నట్లు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో నియమించుకున్న ‘ ఆత్మ’ ల ఫొటోకూడా విడుదలచేసి వారి జీతభత్యాలెంతో వెల్లడించాలని వ్యంగ్యంగా విమర్శలు చేశారు.