విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వలన వెంకటేష్ నటించిన చాలా సినిమాల రిలీజ్ వాయిదా పడింది. ఎఫ్ 3, దృశ్యం 2, నారప్ప చిత్రాలు విడుదలకి సిద్ధం కాగా, ఈ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నారప్ప చిత్రం తమిళ ‘అసురన్’రీమేక్‌గా తెరకెక్కుతుంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక.
రాయలసీమలోని అనంతపూర్ పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, ఇవి సినిమాకు హైలైట్ కానున్నట్టు సమాచారం. అయితే వచ్చే వారం చిత్ర టీజర్ విడుదల కానున్నట్టు సమాచారం. టీజర్ ద్వారా మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. చిత్రంలో వెంకటేష్ రెండు విభిన్న పాత్రలలో కనిపించి మెప్పించనున్నాడు.