హైదరాబాద్: హైదరాబాద్లోని నల్సార్ వర్సిటీలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ సీట్లలో స్థానిక రిజర్వేషన్లను 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక సవరణ చట్టాన్ని చేసినట్లు తెలుస్తోంది.
ఈ తాజా చట్టం వచ్చే నెల అంటే నవంబరు 1 నుంచి అమల్లోకి రానుందని అధికారులు తెలియజేశారు. ఇదే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ విషయం తెలిసిన విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.