e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం


టీఆర్‌ఎస్‌లో చేరికలు చూసి కాంగ్రెస్‌, నాయకుల వెన్నులో వణుకు
ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

నందికొండ, మార్చి 28 : టీఆర్‌ఎస్‌ పార్టీతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్‌, బీజేపీల నుంచి పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరికలే అందుకు నిదర్శనమని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, కరీంనగర్‌ సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణ అన్నారు. ఆదివారం నందికొండ హిల్‌కాలనీలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పులిచర్ల ఎంపీటీసీ దేవసాని లక్ష్మమ్మ, పుల్లారెడ్డి దంపతులు, పైలాన్‌కాలనీలోని 9వ వార్డులో కాంగ్రెస్‌ కార్యకర్తలు, 12వ వార్డులో బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో చేరికలు చూసి కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల వెన్నులో వణుకు పుడుతున్నదని అన్నారు. జానారెడ్డి తాము ఏమి అభివృద్ధి చేశాము, చేస్తాము అనేది చెప్పకుండా ఎన్‌టీఆర్‌ చేసిన మండల వ్యవస్థను తామే చేశామని, 1955లో నిర్మించిన డ్యామ్‌ను తామే కట్టామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మూడు సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి 36లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యే, నాలుగు సార్లు మంత్రిగా చేసిన జానారెడ్డి సాగర్‌ నియోజకవర్గానికి చేసింది ఏమీలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నందికొండ, హాలియా మున్సిపాలిటీల ఏర్పాటు, వంద పడకల దవాఖాన, సబ్‌స్టేషన్లు, రెసిడెన్షియల్‌ కళాశాలలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి మంత్రులుగా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జిల్లాలో ఫ్లోరైడ్‌, నీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించక లేకపోయారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధికి పాటుపడలేదని, పదవుల కోసం పోటీ పడ్డారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమన్నారు. పైలాన్‌కాలనీ నుంచి బీజేపీకి చెందిన పద్మజా, శివ, నారాయణ, పీటర్‌, లక్ష్మి, నగేశ్‌, భీష్మాచారి, కాంగ్రెస్‌ నుంచి ఫాతీమా, మాలన్‌, మున్ని, జుబేదా, ముకిమ్‌, అలీ, దిలావర్‌, జహీర్‌, ఆకాశ్‌, చిన్నా, నసీర్‌, మున్నా, అమీర్‌, సమీర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కర్న బ్రహ్మానందరెడ్డి, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఇర్ల రామకృష్ణ, ఎంపీపీ అనురాధ, సర్పంచులు సైదమ్మ, శంకర్‌, నాయకులు సత్యనారాయణరెడ్డి, లింగారెడ్డి, గుంటక వెంకట్‌రెడ్డి, రవినాయక్‌, ఇమ్రాన్‌, బాలూనాయక్‌, కిషన్‌నాయక్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

ట్రెండింగ్‌

Advertisement