నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32316 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తున్నా రు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.
నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9274 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8718 క్యూసెక్కు లు, ఎస్ఎల్బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28338 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 81445 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 882.10 అడుగులు (199.7354 టీయంసీలు) ఉంది. శ్రీశైలంకు 96110 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.