నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32232 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310.8498 టీఎంసీలు) మేరకు నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుండిచి కుడి కాల్వ ద్వారా 8298 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 7272 క్యూసె క్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 32886 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసి ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 82488 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో అవుట్‌ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు 882.20 అడుగుల వద్ద 200.1971 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు 77275 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.