బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన గంగవ్వ ఉన్నన్ని రోజులు ఎంతగా సందడి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తోటి కంటెస్టెంట్స్‌తోనే కాదు వారం వారం వచ్చే నాగార్జునతో కలిసి సరదాగా ముచ్చటించి అందరిని అలరించింది. ఇక ఇప్పుడు వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్ కోసం నాగార్జునతో కలిసి తెగ సందడి చేసింది గంగవ్వ.గతంలో సమంతను ఇంటర్వ్యూ చేసిన గంగవ్వ తాజాగా నాగ్‌తో కలిసి పలు విషయాలు ముచ్చటించింది.
నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగ్ ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సయామీ ఖేర్, దియా మీర్జా, అతుల్ కుల్ కర్ణి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేళుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే ‘వైల్డ్ గాడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ప్రమోషన్ కోసం టీం గంగవ్వను భలే వాడేసింది. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.