టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవగానే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేస్తున్న లాల్ సింగ్ చధా ప్రాజెక్టులో జాయిన్ కావాల్సి ఉంది. చైతూ ఆర్మీ జవాన్ గా కనిపించనున్నాడు. ఆర్మీ జవాన్ పాత్ర కోసం తన బాడీ షేప్‌ను మరింత డెవలప్ చేసుకునే పనిలో ఉన్నాడని టాలీవుడ్ సర్కిల్ టాక్.
అయితే అమీర్‌ఖాన్ మూవీ షూట్ లో జాయిన్ అయ్యేందుకు ఎక్జయిటింగ్ గా ఉన్న చైతూకు ముందుగా థ్యాంక్యూ చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది. థ్యాంక్యూ ఫైనల్ షెడ్యూల్ జులై మొదటి వారంలో హైదరాబాద్‌లో రీస్టార్ట్ చేయనుంది డైరెక్టర్ విక్రమ్ కుమార్ టీం. 5 రోజుల్లో మొత్తం షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేయనున్నారట.
ఈ చిత్రంలో రాశీఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ కీ రోల్స్ పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఫారెస్ట్ గంప్‌కు రీమేక్ గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చధాలో కరీనాకపూర్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com