Krishna Vrinda Vihari Trailer | నాగశౌర్య హీరోగా వస్తున్న తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి. షెర్లీ సెటియా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనీశ్ ఆర్ కృష్ణ దర్శకుడు. ఉషా మూల్పూరి నిర్మించిన ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు.
సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కృష్ణ అనే యువకుడు ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాక అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో ఈ సినిమా సాగనున్నట్లు ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అన్ని సినిమాలు ముఖేశ్ యాడ్‌తో మొదలైనట్లు.. ఈ సినిమా సత్య అనే డాక్టర్‌తో మొదలవుతుంది అంటూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంది. నేను వెళ్తోంది ఒలింపిక్స్కా? ఉద్యోగానికి అంటూ నాగశౌర్య వేసే పంచ్ .. కేఎఫ్‌సీ అంటూ కారప్పొడి చట్నీ అంటూ బ్రహ్మాజీ కొత్త అర్థం చెప్పడం ఇవన్నీ నవ్వులు పూయించాయి. రాధిక, సత్య, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ వంటి నటులను చూస్తుంటే సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా హిట్ కొట్టేలా కనిపిస్తుంది. మరి చాలారోజులుగా సరైన బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలి !!
Karthikeya-2 Movie | అప్పుడే ఓటీటీలోకి ‘కార్తికేయ-2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?