సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథాంశాలను ప్రేక్షకులకు అందించడంలో ముందుంటాడు టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చైతే నటిస్తోన్న లవ్‌స్టోరీ ఏప్రిల్ లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ యువ నటుడు బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌తో యాడ్ షూట్లో పాల్గొన్నాడు. ఈ ఇద్దరూ కలిసి యాడ్ షూట్ లొకేషన్ లో సెల్ఫీ దిగారు. రెడ్ ట్రాక్ షూట్లో ఉన్న చైతూ డైరెక్టర్ ఫరాఖాన్‌తో దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చధా చిత్రంలో నాగచైతన్య కీ రోల్ చేస్తున్నట్టు వార్తలు రాగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే చైతూ కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.