కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్ గాదె దర్శకుడు. కోడి దివ్యదీప్తి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘నచ్చావు అబ్బాయి..’ అనే పాటను ఆదివారం విడుదల చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ గీతానికి మణిశర్మ స్వరాల్ని అందించారు.
‘నచ్చావ్ అబ్బాయి..పిచ్చిపిచ్చిగా నచ్చావ్ అబ్బాయ్..పోనీలే అమ్మాయి ఇన్నాళ్లకీ..మంచి మాట చెప్పావమ్మా..’ అంటూ చక్కటి రొమాంటిక్ ఫీల్‌తో పాట సాగింది. ‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో ఆకట్టుకునే కథాంశమిదని నిర్మాత కోడి దివ్యదీప్తి చెప్పారు. సోనూ ఠాకూర్, సిద్ధార్థ్మీనన్, యస్వీ కృష్ణారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి, సంగీతం: మణిశర్మ, దర్శకత్వం: శ్రీధర్ గాదె.