న్యూయార్క్లో స్థిరపడిన భారతీయుడు, ప్రవాసాంధ్రుడు రామ్ అల్లాడి దర్శకత్వంలో రూపొందుతున్న సంస్కృత సినిమా ‘నభాంసి’. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఏఆర్ ఐటీవర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ అల్లాడి మాట్లాడుతూ ‘వెయ్యి సంవత్సరాల క్రితం మనదేశంలో జరిగిన కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. భార్యాభర్తల మధ్య జరిగే రొమాంటిక్ కథ ఇది. సాహిత్యం, సంగీతం, నృత్యానికి సినిమాలో ప్రాముఖ్యత వుంటుంది. ‘నభాంసి’ అంటే ఆకాశం అని అర్థం. 75శాతం అమెరికాలో చిత్రీకరణ చేస్తాం.2022లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంభాషణలు: సరితా నవాలి.