లండన్: బ్రిటన్‌లోని వేల్స్ సముద్ర తీరానికి 23 అడుగుల అంతుపట్టని సముద్ర జీవి కలేబరం కొట్టుకొచ్చింది. పెంబ్రోకెషైర్లోని బ్రాడ్ హెవెన్ సౌత్ బీచ్‌లో గత వారం దీనిని గుర్తించారు. తొలుత దీనిని తిమింగలంగా సముద్ర పర్యావరణ పర్యవేక్షణ శాస్త్రవేత్తలు భావించారు. అయితే బాగా కుళ్లిన ఈ జీవికి తల భాగం లేదు. మరోవైపు దాని కడుపు భాగంలో పెద్దగా చుట్టుకొని ఉన్న ఒక దానిని గుర్తించారు. దానిని నిశితంగా పరిశీలించగా దాని భారీ వెన్నుముఖలోని వెన్నుపూసగా కనుగొన్నారు.
నడుము భాగంలోని ఎముకలను పరిశీలించిన తర్వాత అది ఒక చేప జాతికి చెందిన భారీ సముద్ర జీవి అయ్యి ఉంటుందని సముద్ర పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని వెన్నుముఖ 23 అడుగులు ఉన్నట్లు మాథ్యూ వెస్ట్‌ఫీల్డ్ అనే అధికారి తెలిపారు. బాస్కింగ్ షార్క్ కలేబరం అయ్యి ఉంటుందన్న నివేదిక అందిందని చెప్పారు. అయితే డీఎన్ఏ నమూనాలను శాస్త్రీయంగా పరిశీలించన తర్వాత ఆ సముద్ర జీవి ఏమిటన్నది స్పష్టమవుతుందని ఆయన వెల్లడించారు.