కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం13693.02 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 7040.73 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
కుడి,ఎడమ కాలువలకు 180.72 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 640.40 అడుగులుగా (3.31 టీఎంసీలు) ఉన్నట్లు అధికారులు తెలిపారు.