MI vs RR | ప్లే ఆఫ్స్ చివరి బెర్తుకు పోటీ పడుతున్న రాజస్థాన్ రాయల్స్ చావోరేవో మ్యాచ్ ఆడుతోంది. డబుల్ హైడర్ మ్యాచ్‌లో భాగంగా మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఆర్ఆర్ ఆశలపై నీళ్లు చల్లుతుందో లేదో చూడాలి.
రౌండ్-రాబిన్ దశ చివరి రోజు వరకు పంజాబ్, కేకేఆర్, ఆర్ఆర్ మూడు జట్లు ఇంకా అర్హత రేసులో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అనేక రకాల సమీకరణాలు, అవకాశాలు తెరపైకి వస్తున్నాయి. నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండే ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ప్రస్తుతం నాలుగో బెర్త్ కోసం పంజాబ్ కింగ్స్ (15), రాజస్థాన్ రాయల్స్ (14), కోల్‌కతా నైట్‌రైడర్స్ (13) పాయింట్లతో రేసులో ఉన్నాయి.