Mrunal Thakur Gets Emotional | దుల్కర్ సల్మాన్, మృనాళ్ థాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సీతారామం’. ‘అందాల రాక్షసి’ ఫేం హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత ఒక ప్యూర్ లవ్ స్టోరీని తెరపై చూసినట్లు అనిపిస్తుందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. దుల్కర్, మృనాళ్ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారని, హను రాఘవపూడి టేకింగ్, విజువల్స్ వండర్ అని సోషల్ మీడియాలో పలువురు నెటీజన్లు చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమాను చూశారు.
కాగా సినిమా అనంతరం ప్రేక్షకుల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ చూసి మృనాళ్ ఎమోషనల్ అయింది. డైరెక్టర్ హను రాఘవపూడిని పట్టుకుని ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో దుల్కర్ కూడా కొంచెం ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించనున్నాడు. మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా ముఖ్య పాత్రలో నటించింది. నటుడు సుమంత్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించాడు.
. @mrunal0801 gets very emotional and cries as she hugs #SitaRamam director #HanuRaghavapudi. @dulQuer gets a little emotional too after watching #SitaRamam 🥺❤️#sitaramam #dulquersalmaan #mrunalthakur #pinkvillasouth pic.twitter.com/fYHGmCGZxZ
— Pinkvilla South (@PinkvillaSouth) August 5, 2022