e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్‌ పైప్‌.. రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ సస్పెండ్‌

తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్‌ పైప్‌.. రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ సస్పెండ్‌

తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్‌ పైప్‌.. రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ సస్పెండ్‌

భోపాల్‌: రైల్వే స్టేషన్‌లోని తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్‌ పైప్‌ అటాచ్‌ చేశారు. ఒక ప్రైవేట్‌ వర్కర్‌ చేసిన పొరపాటుకు రైల్వేస్టేషన్‌ మాస్టర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మధ్యప్రదేశ్‌లోని మాండ్సౌర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కోటా రైల్వే డివిజన్‌ పరిధిలోని గారోత్ స్టేషన్‌లో ప్రైవేట్‌ సంస్థకు చెందిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు టాయిలెట్‌ పైప్‌లైన్‌ను తాగు నీటి ట్యాంకుకు కలిపాడు. ఈ విషయాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

రైల్వే అధికారులు దీనిపై స్పందించారు. ఆ పారిశుద్ధ్య కార్మికుడ్ని విధుల నుంచి తొలగించామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేషన్‌ మాస్టర్‌ చౌత్మల్ మీనాను సస్పెన్షన్‌లో ఉంచామని పశ్చిమ సెంట్రల్‌ రైల్వే ఈ నెల 5న తెలిపింది. ఆ వాటర్‌ ట్యాంకును పూర్తిగా శుభ్రం చేసి తాగు నీటి వినియోగానికి అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

Advertisement
తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్‌ పైప్‌.. రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ సస్పెండ్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement