తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన హీరోయిన్స్ రెజీనా కసాండ్రా (Regina), నివేదా థామస్ (Nivetha Thomas) టైటిల్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం శాకిని డాకిని(Saakini Daakini). ఇప్పటికే రిలీజైన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. శాకిని డాకిని సెప్టెంబర్ 16 (శుక్రవారం) విడుదల కానుంది. ఇప్పటికే నిర్మాత సునీతా తాటి అండ్ హీరోయిన్స్ టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
సోమవారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు అడివి శేష్, అనుదీప్, నందినీరెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత సునీత తాటి (Sunita Tati) మాట్లాడుతూ..సమంత, నందినిరెడ్డి లేకపోతే ఓ బేబి సినిమా ఎలా ఉండకపోయేదో..రెజీనా, నివేదా లేకుంటే కూడా శాకిని డాకిని తెరకెక్కి ఉండేది కాదని అన్నారు. డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్ డిపార్టుమెంట్లో ఒకరైన సంయుక్త ఫీ మేల్ క్యారెక్టర్స్ లీడ్ రోల్స్ లో సినిమా చేయాలనే ఐడియా తనకు, డైరెక్టర్ బాగా నచ్చడంతో ఈ సినిమా కార్యరూపం దాల్చిందని చెప్పారు.
ఈ ప్రాజెక్టు కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. సురేష్ బాబు, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి స్వామిరారా ఫేం సుధీర్ వర్మ(Sudheer Varma)దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ ఎంసీ క్లియరీ సంగీతం అందిస్తున్నాడు.