e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, April 17, 2021
Advertisement
Home News ఆ సీన్ల‌లో న‌టించేందుకు రెడీ అంటోన్న అమ‌లాపాల్‌..!

ఆ సీన్ల‌లో న‌టించేందుకు రెడీ అంటోన్న అమ‌లాపాల్‌..!

ఆ సీన్ల‌లో న‌టించేందుకు రెడీ అంటోన్న అమ‌లాపాల్‌..!

పిట్ట‌క‌థ‌లు సినిమాతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది మ‌ల‌యాళ భామ అమ‌లాపాల్‌. ఈ బ్యూటీ న‌టించిన పాత్ర‌కు మంచి ప్ర‌శంస‌లు అందుకుంది. రాబోయే కాలంలో త‌న‌కు అలాంటి మ‌రిన్ని బోల్డ్ క‌థాంశాల్లో న‌టించే ఛాన్స్ రావాల‌ని ఎదురుచూస్తోంద‌ట అమ‌లాపాల్‌. తెలుగు ద‌ర్శ‌కనిర్మాత‌ల‌కు కూడా ఇదే విష‌యాన్ని చెప్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. డేరింగ్ రోల్స్ లో తాను న‌టించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని హామీ కూడా ఇస్తున్న‌ట్టు ఇన్‌సైట్ టాక్‌.

అంతేకాదు ఈ భామ  లిప్ టు లిప్ కిస్ సీన్ల‌కు కూడా ప‌చ్చ‌జెండా ఊపింద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. గ్లోబ‌ల్ ఆడియెన్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు క‌నెక్ట్ అయ్యేలా మ‌రిన్ని వెబ్ డ్రామాలు, ఓటీటీ షోలు చేయాల‌నుకుంటుంద‌ట అమ‌లాపాల్‌. ద‌క్షిణాది రాధికాఆప్టేగా పేరు తెచ్చుకోవాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న అమ‌లాపాల్‌కు ఫిల్మ్ మేక‌ర్స్ ఆఫ‌ర్స్ ఇస్తారా అన్న‌ది కాల‌మే నిర్ణ‌యిస్తుంది. 

ఆస‌క్తిక‌ర విష‌మేంటంటే త‌న బేస్‌ను చెన్నై నుంచి హైద‌రాబాద్‌కు మార్చాల‌నే యోచ‌న‌లో అమ‌లాపాల్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి అప్పుడ‌పుడు తెలుగు ప్రేక్ష‌కులను ప‌లుక‌రించిన ఈ భామ ఇక నుంచి పూర్తి స్తాయిలో ఇక్క‌డి ఆడియెన్స్ ను ఎంట‌ర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంద‌ని అర్థ‌మైపోతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
ఆ సీన్ల‌లో న‌టించేందుకు రెడీ అంటోన్న అమ‌లాపాల్‌..!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement