నల్లగొండ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల తొలిరౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. అధికారులు రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి మొత్తం 3,86,320 ఓట్లు పోలయ్యాయి.