హైదరాబాద్ : బోధన్ శాసనసభ్యుడు షకీల్ అహ్మద్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఎమ్మెల్యే షకీల్‌తో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. షకీల్ అహ్మద్ ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు.