హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాల్లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఏసీటీ ఇంచార్జి రవి సాయల ఆధ్వర్యంలో కాన్బెర్రాలో కవిత దీర్ఘాఆయుష్షు కోసం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ.. కవిత ఆశీస్సులతో ఆవిర్భవించిన తమ టీఆర్ఎస్ ఆస్ట్రేలియా, అనతికాలంలోనే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో కార్యవర్గాల్ని ఏర్పరుచుకొని, వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తుందన్నారు. తమకీ అవకాశం కల్పించిన కవిత అక్కకు తెలిపారు. కార్యక్రమంలో రాజేష్ గిరి రాపోలు, సాయిరాం ఉప్పు, ప్రవీణ్ పిన్నమ, శ్రీకాంత్ రెడ్డి, రవి యాదవ్, రాకేష్ లక్కరసు, వీరు సాంబరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు .