హైదరాబాద్ : నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు హోంశాఖ కేటాయిస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ అది జరగలేదు. రోజా వికిపీడియాలోనూ ఆమెకు హోంశాఖ కేటాయించినట్లు పొందుపరిచారు. కొత్త మంత్రులకు కేటాయించిన శాఖల జాబితా బయటకు రావడంతో అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది.
25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయగా, ఇందులో నలుగురు మహిళలు ఉన్నారు. అయితే కీలకమైన
హోంశాఖను తానేటి వనితకు అప్పగించారు సీఎం జగన్. మరో కీలకమైన వైద్యారోగ్య శాఖను విడదల రజనీకి కేటాయించారు. ఆర్కే రోజాకు పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖ కేటాయించగా, కల్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీచరణ్కు మహిళా, శిశు సంక్షేమ శాఖ కేటాయించారు.