e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News క్యాడర్‌ లేని పార్టీకి లీడర్‌ రేవంత్‌రెడ్డి : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

క్యాడర్‌ లేని పార్టీకి లీడర్‌ రేవంత్‌రెడ్డి : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌ : క్యాడర్‌ లేని పార్టీకి లీడర్‌ రేవంత్‌రెడ్డి అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గాదరి కిశోర్‌తో కలిసి మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ డ్రగ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడో అన్నారన్నారు. ద బోస్టన్‌ టైమ్స్‌లో కాంగ్రెస్‌ ఘనకీర్తి వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. అభివృద్ధికి కేటీఆర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే.. రేవంత్‌ బ్లాక్‌ మెయిల్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని విమర్శించారు.

కేటీఆర్‌పై అనవసర విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మాకు తెలిసిన వైట్‌ వేరు.. దొంగలకు పెద్ద రేవంత్‌కు తెలిసిన వైట్‌ వేరన్నారు. ఒక వృత్తిని బతికించడానికి తాము ఆనాడే వైట్ ఛాలెంజ్ పెట్టామని, మాకు తెలిసిన వైట్ అంటే తెల్లకల్లు, రేవంత్‌రెడ్డికి తెలిసిన వైట్ డ్రగ్స్, గంజాయి అని ఆరోపించారు. తెలంగాణ ప్రతిష్టను రేవంత్ దిగజార్చుతున్నాడని.. పబ్బులు, క్లబ్బులు తెలంగాణలోనే ఉన్నాయా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవా? అని ప్రశ్నించారు.

- Advertisement -

తెలంగాణ పరువు ప్రతిష్టలను, హైదరాబాద్ ఇమేజీని దెబ్బతీస్తున్న రేవంత్‌పై ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి పదేపదే నిరాధారమై ఆరోపణలు చేసి అబాసుపాలవుతున్నారన్నారు. మీ పార్టీ అధిష్ఠానానికి నీపై నమ్మకముంటే కేటీఆర్‌.. రాహుల్‌ గాంధీపై విసిరిన సవాల్‌ను స్వీకరించమని చెప్పాలని.. లేదంటే పీసీసీకి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆర్టీఐ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపించారు. సమాజంలో గుర్తింపు కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. గాడిదకు మూలాలు తెలుసుకు కాబట్టే గాడిదలా మాట్లాడుతున్నారని.. ఆ పార్టీ వాళ్లే అంటున్నారన్నారు. రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ సర్వనాశనం అవుతుందని విమర్శించారు. తర్వాత కాంగ్రెస్‌ పరిస్థితి అంతేనన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement