హీరో చేయి తాకిందని వీరాభిమాని సంబురం
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ అభిమాని చెంపఛెళ్లుమనిపించారు. హిందూపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఒకరి ఇంట్లోకి వెళ్లి వారితో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న సోము అనే యువకుడు బాలకృష్ణకు అడ్డుపడుతూ వీడియో తీస్తున్నాడు. బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిపై చేయి చేసుకున్నాడు. ఘటనపై సోము స్పందిస్తూ. తాను బాలయ్యకు వీరాభిమానినని, ఈ విధంగానైనా తనను తాకడం సంతోషంగా ఉందన్నాడు.