హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.