హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం నుంచి బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడచులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులపాటు తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత వైభవంగా పండుగ జరుపుకొంటారని చెప్పారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించే అద్భుత సంస్కృతికి తెలంగాణ ప్రతీక అని పేర్కొన్నారు.