e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home తెలంగాణ Nనో.. Dడాటా.. Aఅవైలబుల్‌..

Nనో.. Dడాటా.. Aఅవైలబుల్‌..


మీరిస్తామన్న ఉద్యోగాలు వెతుకుతున్నా
వివరాలు పట్టుకునే పనిలో బిజీగా ఉన్నా
సమాచారం ఎక్కడా దొరకటం లేదు
లెక్కపత్రాలుంటే మీరైనా ఇస్తారా!
బీజేపీ నేతకు ట్విట్టర్‌లో కేటీఆర్‌ పంచ్

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉస్మానియా యూనివర్సిటీలో హడావుడి చేద్దామనుకున్న బీజేపీ అభ్యర్థి.. అనూహ్యమైన సమాధానంతో అవాక్కయ్యారు! ట్విట్టర్‌లో మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సవాలు విసిరి.. తానే బొక్కబోర్లా పడ్డారు! కేటీఆర్‌ ఇచ్చిన రిటార్ట్‌తో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు!

Nనో.. Dడాటా.. Aఅవైలబుల్‌..

హైదరాబాద్‌, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ‘12 కోట్ల ఉద్యోగాలిచ్చామన్నారు.. వాటి వివరాలేవి? అవి వెతికే పనిలో చాలా బిజీగా ఉన్నా.. వివరాలేమైనా ఉంటే చెప్పండి?’ అంటూ మంత్రి కే తారకరామారావు బీజేపీ నేతలకు ట్విట్టర్‌లో పంచ్‌ ఇచ్చారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాంచందర్‌రావు.. సోమవారం పొద్దున్నే ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ దగ్గరకు వెళ్లి హడావుడిచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై చర్చించేందుకు తాను అక్కడికి వచ్చానని మీరెక్కడ ఉన్నారంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌చేశారు. దీనిపై కేటీఆర్‌ వ్యంగ్యంగా, ఘాటుగా స్పందించారు. బీజేపీ గత ఆరేండ్లలో ఇచ్చిన 12 కోట్ల ఉద్యోగాల గురించిన వివరాలను సేకరించే పనిలో బిజీగా ఉన్నానని ట్వీట్‌చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్డీఏ ఎన్నికల హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వీటితోపాటు ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల డబ్బులు వేస్తామని చెప్పారని ఎంతమందికి వేశారో వివరాలకోసం వెతుకుతున్నానని పేర్కొన్నారు. ఎంత వెతికినా కేంద్రం ఇచ్చిన ఉద్యోగాల వివరాలు దొరకడం లేదని.. మీ దగ్గర జవాబుంటే చెప్పాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఎన్‌డీఏ అంటే ‘నో డాటా అవైలబుల్‌’ అని కూడా వ్యంగ్యంగా ట్వీట్‌చేశారు.

జవాబు చెప్పరేం?
ఆరేండ్లు గడిచిపోయినా.. తెలంగాణకు బీజేపీ వాళ్లించ్చిందేం లేదు.. చేసిందీ ఏమీ లేదని కమలనాథుల డ్రామాపై నెటిజన్లు మండిపడ్డారు. ఉన్న పథకాలకు పైసా ఇయ్యరు.. ఇచ్చిన హామీలను చెత్తబుట్టలో పారేస్తరని, లక్ష ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్‌ను లేకుండా చేశారని మండిపడ్డారు. దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలంటరు.. ఖాతాకు 15 లక్షలిస్తమంటరు.. ఎక్కడ ఇచ్చిన్రయ్యా అంటే.. పకోడీలు అమ్ముకొనే వారి ఉపాధికి కారణం మేమే అంటరని ఎద్దేవాచేశారు. తెలంగాణకు వచ్చి మాత్రం మీరేమిచ్చారంటూ గెట్టుమీద నిం చొని అరుస్తూ ఉంటరని ట్వీట్లుచేశారు. ఇదిగో మేం ఇచ్చినయి ఇవి.. వాటి లెక్కలివి.. అని టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం అధికారికంగా చెప్పినా వారి చెవికెక్కడం లేద ని విమర్శించారు. రోజుకొకరు బజార్నపడి చర్చిద్దామంటూ తెగ హడావుడి చేస్తున్నారని, మొన్నొక కాం గ్రెసాయన గన్‌పార్క్‌ దగ్గర రెచ్చిపోతే.. సోమవారం బీజేపీ నేత ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ దగ్గర రాద్ధాంతంచేశారని, చివరకు మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన ఒక్క జవాబుతో ఆయననోరు మూతపడిందని ట్వీట్లుచేశారు.

Advertisement
Nనో.. Dడాటా.. Aఅవైలబుల్‌..
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement