హైదరాబాద్: లెజెండరీ సింగర్, గాన కోకిల లతా మంగేష్కర్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. భారతదేశ సినీ సంగీత రంగానికి దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన లతా మంగేష్కర్ మరణం తీరని లోటు అన్నారు. భారతదేశ సినీ రంగానికి ఆమె మరణం తీరనిలోటని, ఆమె అందించిన అద్భుతమైన పాటల రూపంలో.. ఆమె వారసత్వం శాశ్వతంగా నిలిచి ఉంటుందని కేటీఆర్ అన్నారు.
లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు.
భారత రత్న లతామంగేష్కర్ మృతిపట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. 50 వేలకుపైగా పాటలు పాడారని, ఎప్పటికీ ఆమె పాటలు అభిమానులను అలరిస్తాయన్నారు. సినీ పరిశ్రమ ఒక గొప్ప గాయనిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు
గాయని లతా మంగేష్కర్ మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లతాజీ మృతి దేశానికి తీరని లోటన్నారు. ఎన్నో తరాల పాటు లతాజీ పాటలు గుర్తుండిపోతాయన్నారు.