తెలంగాణ వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. ‘ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యంలో అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో.. ఈ రోజు అక్కడే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం’ అని పేర్కొన్నారు.