హైదరాబాద్: టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి, ఆస్ట్రేలియాలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నందుకుగాను సంతోషం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి.. మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కోసం నిరంతరం ఇలాగే కష్టపడి పనిచేయాలని కాసర్లకు సూచించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించడంతో పాటు వారి గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి వివిధ రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు. ఎన్ఆర్ఐలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని కాసర్లకు కేటీఆర్ చెప్పారు.