e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, April 13, 2021
Advertisement
Home News వాణీదేవిని గెలిపించండి

వాణీదేవిని గెలిపించండి

పంచాయతీరాజ్‌ ఉద్యోగులతోనే ఆదర్శంగా నిలిచిన గ్రామాలు
ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజినీర్ల కృషి అద్భుతం
టీజీవోలతో ప్రభుత్వానికి విడదీయరాని సంబంధం: ఆర్థికమంత్రి హరీశ్‌రావు

వాణీదేవిని గెలిపించండి


హైదరాబాద్‌, మార్చి 7 (నమస్తే తెలంగాణ )/ మన్సూరాబాద్‌/చంపాపేట: పట్టభద్రుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. హైదరాబాద్‌ శివారు మన్నెగూడ, నగరంలోని కర్మన్‌ఘాట్‌, నాగోల్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశాల్లో హరీశ్‌ పాల్గొన్నారు. మన్నెగూడలో నిర్వహించిన తెలంగాణ పంచాయతీరాజ్‌ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ.. దేశంలో క్రమం తప్పకుండా పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని తెలిపారు. పల్లెలను ఆదర్శ గ్రామాలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు.
ఇందులో పంచాయతీరాజ్‌ ఉద్యోగుల కృషి ఎంతోగానో ఉందని కొనియాడారు. తండ్రిలాంటి సీఎం కేసీఆర్‌ ఉద్యోగులను సంతృప్తి పర్చేలా పీఆర్సీ ప్రకటిస్తారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తనపై నమ్మకంతో అభ్యర్థిగా నిలబెట్టారని, తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌శాఖలోని 12 సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సర్వీస్‌ అసోసియేషన్‌ సమన్వయ కమిటీని ఏర్పాటుచేశారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌, ఉద్యోగ నేతలు రాఘవేందర్‌రావు, సురేశ్‌మోహన్‌, శ్రీనివాస్‌రావు, సత్తయ్య, ప్రశాంతి, శేషు, పర్వతాలు, మధుసూదన్‌రెడ్డి, యాద య్య, శ్రీనివాస్‌రావు, సత్యానారాయణరెడ్డి పాల్గొన్నారు.
అన్నిరంగాల్లోనూ తెలంగాణ బెటర్
బీజేపీ పాలిత రాష్ర్టాలకంటే తెలంగాణ అన్నిరంగాల్లోనూ ముందంజలో ఉన్నదని మంత్రి హరీశ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌, ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నాగోల్‌ బండ్లగూడలోని పీఎంఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌, ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. కర్మన్‌ఘాట్‌లో తెలంగాణ ఇంజినీర్ల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇంజినీర్ల చెమట చుక్కలతో రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మించుకున్నామన్నారు. పీఆర్‌ ఇంజినీర్ల కృషితో నేడు గ్రామాలు అభివృద్ధిపథంలో సాగుతున్నాయని తెలిపారు. విశ్రాంత ఇంజినీర్లు రచించిన చేను కిందే చెరువు, పోతిరెడ్డిపాడు వివాదం, ఇయర్‌బుక్‌లను మంత్రులు ఆవిష్కరించారు. ఇంజినీర్ల జేఏసీ నేతలు వెంకటేశం శ్రీధర్‌ దేశ్‌పాండే, దామోదర్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
వాణీదేవికి టీజీవోల మద్దతు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి టీజీవో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆదివారం నాంపల్లిలోని టీజీవో భవనంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌తో టీజీవో నేతలతో భేటీ అయ్యారు. విద్యావేత్త సురభి వాణీదేవికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు టీజీవో ప్రధానకార్యదర్శి ఏ సత్యనారాయణ తెలిపారు. మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. టీజీవోలతో ప్రభుత్వానికి ఉన్న సంబంధం విడదీయరానిదని, ఒకే నెలలో 32 వేలమంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. సమావేశంలో టీజీవో నేతలు రవీందర్‌కుమార్‌, ఎస్‌ సహదేవ్‌, ఎంబీ కృష్ణాయాదవ్‌, జీ వెంకటేశ్వర్లు, బీ వెంకటయ్య, ప్రణయ్‌కుమార్‌, హరికృష్ణ, శిరీష, రేవతి, ప్రదీప్‌, గోపాలకృష్ణ, గోపీచంద్‌, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
వాణీదేవిని గెలిపించండి

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement