కరీంనగర్ : ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ చౌక్‌లో మహిళా కార్పొరేటర్లు సీఎం కేసీఆర్ కటౌట్‌కు రాఖీలు కట్టిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు గంగుల కమలాకర్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల కోసం వితంతు పెన్షన్లు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌కు, మేయర్ సునీల్ రావుకు మహిళా కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి అంతకుముందు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని శ్రీహరి నగర్లో ఇంటింటికి జాతీయ పథకాలు పంపిణీ చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.