దుక్కి దున్ని నారు వేసేందుకు సిద్ధం చేసిన పొలం కాస్త పాలతో నిండిపోయింది. అటుగా వెళ్తున్న పాల ట్యాంకర్ అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో పొలం ఇలా నీటికి బదులు తెల్లని పాలతో కనిపించింది.
మంగళవారం ఏపీలోని ప్రకాశం జిల్లా నుంచి కరీంనగర్ డెయిరీకి వెళ్తున్న పాల లారీ జనగామ జిల్లా నర్మెట మండలం హన్మంతాపూర్ శివారు దొడ్లగడ్డతండా వద్ద జనగామ-హుస్నాబాద్ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటడ్డాడు.
– నర్మెట