రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో నటించడం విశేషం. దీపావళి సందర్భంగా ఈ సినిమాలో మైక్ టైసన్ లుక్‌ను విడుదల చేశారు.
తాజా షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీన టీమ్ అమెరికా చేరుకోగా, ప్రస్తుతం మైక్ టైసన్, విజయ్ దేవరకొండ మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాడు పూరీ. తాజాగా మైక్ టైసన్ చిత్ర బృందంతో కలిసాడు. విజయ్.. మైక్ టైసన్‌తో కలిసి వెరైటీగా ఫొటో దిగాడు. ఆయనతో కలిసి పని చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ ఈ మెమోరీస్ జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నాడు.
పూరీ జగన్నాథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడమే కాకుండా ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇలా మొత్తం యూనిట్‌కు లైగర్ తొలి పాన్ ఇండియా మూవీ. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. సినిమాపై భారీ అంచనాలున్నాయి.