ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్.. తాజాగా వీల్‌చైర్‌లో కూర్చొని కనిపించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు ఏమైందని ఆందోళన వ్యక్తం చేశారు. మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టైసన్ ఇలా వీల్‌చైర్‌లో కనిపించాడు. అతన్ని చూసిన కొందరు వెళ్లి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఈ ఫొటోల్లో 56 ఏళ్ల టైసన్ వీల్‌చైర్‌లో కూర్చొని, ఒక వాకింగ్ స్టిక్ పట్టుకొని ఉన్నాడు.
ఇంతకుముందు న్యూయార్క్‌లో కూడా చేతికర్ర సాయంతో నడుస్తూ కనిపించాడీ మాజీ బాక్సర్. కాళ్లలో వచ్చే సియాటికా నరాలు ఇబ్బంది పెట్టడంతోనే టైసన్ వీల్‌చైర్ వాడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 25న విడుదలయ్యే పాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో కూడా టైసన్ కనిపిస్తాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.