e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News జస్ట్ 50 మినిట్స్ లో 80%: సూపర్ ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు…ఎక్కడంటే..?

జస్ట్ 50 మినిట్స్ లో 80%: సూపర్ ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు…ఎక్కడంటే..?

పుణె,జూలై :ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ ఇటీవల ఫోర్టమ్ చార్జ్,డ్రైవ్ ఇండియాతో భాగస్వామ్యంలో భాగంగా ఎంజీ మోటార్ ఇండియా పూణేలో 50 కిలోవాట్ల పబ్లిక్ ఈవి చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ చార్జింగ్ స్టేషన్ లో కంబైన్డ్ చార్జింగ్ సిస్టమ్ (సీసీఎస్2) కు మద్దతిచ్చే ఏదైనా ఎలక్ట్రిక్ కారును చార్జ్ చేయవచ్చు. దీని కోసం కారు యజమాని ఫోర్టమ్ మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ చార్జర్‌తో ఎంజి జెడ్ఎస్ ఈవి ని కేవలం 50 నిమిషాల్లో 80 శాతం వరకు చార్జ్ చేయవచ్చు.

ఎంజీ మోటార్ ఇండియా ఈ ఎస్‌యూవీ కోసం ఫ్రీ ఎసి చార్జర్, ప్లగ్-అండ్-చార్జ్ కేబుల్ ఆన్‌బోర్డ్‌ను కూడా అందిస్తుంది.దీని సహాయంతో ఈ ఎలక్ట్రిక్ కారును ఇండ్ల వద్ద గానీ,ఆఫీస్ వద్ద గానీ సులభంగా చార్జ్ చేయవచ్చు. అంతే కాకుండా ప్రయాణంలో కూడా రోడ్ పక్కన చార్జ్ చేయవచ్చు.

- Advertisement -

ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ‘గౌరవ్ గుప్తా’ మాట్లాడుతూ ఫోర్టమ్‌తో మా అనుబంధం దేశంలో పర్యావరణానికి మేలు చేసే పరిష్కారాల కోసం మౌలిక సదుపాయాలను కల్పించాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని అన్నారు. దశలవారీగా మరిన్ని నగరాల్లో ఈ సూపర్ ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana