న్యూయార్క్ : మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా ఉద్యోగులకు గడ్డు పరిస్ధితులు ఎదురవుతున్నాయి. పలు టీముల నుంచి 12,000 మంది వరకూ సరైన సామర్ధ్యం కనబరచని ఉద్యోగులను ఫేస్బుక్ మాతృ సంస్ధ మెటా విధుల నుంచి తొలగించవచ్చని ప్రచారం సాగుతోంది. ఫేస్బుక్లో మాస్ లేఆఫ్స్ వార్త టెకీల్లో గుబులు రేపుతోంది.
తాజా నియామకాలను నిలిపివేశామని జుకర్‌బర్గ్ ఇటీవల మెటా ఎర్నింగ్స్ కాల్లో తేల్చిచెప్పారు. ఈ అంశంపై కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా ఆశించిన సామర్ధ్యం ప్రదర్శించని 15 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేస్తుందని అంచనాలు ఊపందుకున్నాయి.
రాబోయే వారాల్లో భారీ లేఆఫ్స్‌కు అనుగుణంగా కంపెనీ అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు. నియామకాల నిలిపివేత రాబోయే రోజుల్లో లేఆఫ్స్ ఉంటాయని గతంలోనే కంపెనీ సంకేతాలు పంపడంతో సిబ్బందిపై వేటు వార్తలపై ఉద్యోగుల్లో పెద్దగా ఆశ్చర్యం కనిపించడం లేదు. ఇటీవల ఉద్యోగులతో జరిగిన భేటీలో మెటా సీఈవో భవిష్యత్‌లో లేఆఫ్స్‌పై ఉద్యోగులకు హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో సిబ్బంది పెరుగుదలను తగ్గించాలనేది తమ వ్యూహమని జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.