మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో యాంటీ వ్యాక్సిన్ నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో రెండు వారాల పాటు ఆ నగరంలో నిర్మాణ పనులను నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్లో తాజాగా కోవిడ్ కేసులు పెరిగాయి. దీంతో ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక కార్మికుడు కనీసం ఒక్క డోసు కోవిడ్ టీకా అయిన తీసుకుని పనికి వెళ్లాలని ఆదేశించింది. అయితే నిర్మాణ రంగ కార్మికులు దీన్ని వ్యతిరేకించారు. పోలీసులుకు, యాంటీ వ్యాక్సిన్ ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగింది. మంగళవారం నుంచి నిర్మాణ సైట్లను మూసివేయనున్నారు. పోలీసులతో జరిగిన ఘర్షణలో అనేక మందిని అరెస్టు చేసినట్లు విక్టోరియా ప్రభుత్వం పేర్కొన్నది. నిరసనకారుల ప్రదర్శనలో ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యింది. మంగళవారం మెల్బోర్న్లో జరిగిన యాంటీ వ్యాక్సినేషన్ ప్రదర్శనలో వందలాది మంది పాల్గొన్నారు.