టాలీవుడ్ హీరోల్లో చాలా మంది మంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరి హీరో సినిమా ప్రమోషన్స్ లో మరో హీరో పాల్గొంటుంటారు ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ రోల్లో కూడా కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతుంటారు. నాలుగేళ్ల విరామం తర్వాత అహం బ్రహ్మాస్మి సినిమాలో నటిస్తున్నాడు మంచు మనోజ్. ఈ సినిమాలో మనోజ్ ఫ్రెండ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కీ రోల్లో కనిపిస్తాడట.
అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాయి, మనోజ్ చాలా ఏండ్ల నుంచి మంచి స్నేహితులు. గతంలో వీరిద్దరి కాంబోలో బిల్లా రంగా రీమేక్ రానుందని వార్తలు కూడా వచ్చాయి. అహం బ్రహ్మాస్మిలో తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా..డెబ్యూట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.