మెక్డొనాల్డ్స్ చికెన్ నగ్గెట్స్ను ఇష్టపడని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి నగ్గెట్స్ అంటే ఇష్టమట. అయితే, వీడియో గేమ్ క్యారెక్టర్ ఆకారంలో ఉన్న నగ్గెట్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే దాని ధర దాదాపు లక్ష డాలర్లు.
“అమాంగ్ అస్” అనే వీడియోగేమ్లోని “సుస్” పాత్రను ఈ నగ్గెట్ పోలి ఉంది. దీన్ని ‘పోలిజ్నా’ అనే వినియోగదారు ఈబే సైట్లో లిస్టెడ్ చేశారు. ఈ నగ్గెట్ను ప్రసిద్ధ కొరియన్ బ్యాండ్ బీటీఎస్ నుంచి ప్రేరణ పొంది స్పెషల్ మీల్లో భాగంగా తయారు చేశారు. కాగా, మొదట ఈ నగ్గెట్కు 99 సెంట్ల వద్ద బిడ్ ప్రారంభమైంది. సుమారు 184 బిడ్లను స్వీకరించిన తర్వాత ఇది 99,997 డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే దాదాపు లక్ష డాలర్లకు సమానమన్నమాట. ఈ ధరను చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోయారు.