Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్‌మార్కెట్ల ట్రేడింగ్‌లో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థలు రూ.2,00,280.75 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిల్లో ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 952.35 (1.59 శాతం) నష్టపోయింది. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), హెచ్డీఎఫ్సీ భారీగా నష్టపోయాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), అదానీ ట్రాన్స్మిషన్, బజాజ్ ఫైనాన్స్ స్క్రిప్ట్‌లు లబ్ధి పొందాయి.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.76,346.11 కోట్లు పతనమై రూ.11,00,880.49 కోట్లకు పరిమితమైంది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ. 55,831.53 కోట్లు కోల్పోయి రూ.5,80,312.32 కోట్లకు చేరుకున్నది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 46,852.27 కోట్లు నష్టపోయి రూ.16,90,865.41 కోట్ల వద్ద ముగిసింది. హెచ్‌యూఎల్ ఎం-క్యాప్ రూ.14,015.31 కోట్లు పతనంతో రూ.5,94,058.91 కోట్లతో సరిపెట్టుకుంది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.4,620.81 కోట్ల నష్టంతో రూ.4,36,880.78 కోట్లకు చేరుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,614.72 కోట్లు కోల్పోయి రూ.8,31,239.46 కోట్ల వద్ద స్థిర పడింది.
అదానీ ట్రాన్స్మిషన్ ఎం-క్యాప్ రూ.17,719.6 కోట్లు జత కలిసి రూ.4,56,292.28 కోట్లకు పెరిగింది. ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7,273.55 కోట్లు పెరిగి రూ.5,01,206.19 కోట్లకు చేరుకున్నది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ. 6,435.71 కోట్లు వృద్ధి చెంది రూ.4,41,348.83 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,286.92 కోట్లు లాభ పడి రూ. 6,33,110.48 కోట్ల వద్ద స్థిర పడింది.
టాప్-10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లీడ్‌లో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, అదానీ ట్రాన్స్మిషన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ నిలిచాయి.