Karthikeya-2 Movie Trailer | ఫలితంతో సంబంధంలేకుండా ప్రేక్షకులకు కొత్త కథలను పరిచయం చేసే నటులలో నిఖిల్ ఒకడు. కెరీర్ మొదటి నుండి విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే విధంగా ప్రేక్షకులు భావిస్తుంటారు. ప్రస్తుతం ఈయన నటించిన ‘కార్తికేయ-2’ విడుదలకు సిద్ధంగా ఉంది. చందుముండేటీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2017లో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమా ట్రైలర్ శనివారం సాయంత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇక ‘కార్తికేయ-2’ ట్రైలర్‌ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 13న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Mass Maharaja @RaviTeja_offl Garu will launch the #Karthikeya2 theatrical trailer today at 4.05 PM 🔥
2 Hours to Go❤️🔥#KrishnaIsTruth#Karthikeya2onAugust13th@actor_Nikhil @anupamahere @AnupamPKher @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @peoplemediafcy pic.twitter.com/NvcjjXwjhS
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 6, 2022