e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News మాస్కు లేని ప్రయాణం ప్రాణాంతకమే

మాస్కు లేని ప్రయాణం ప్రాణాంతకమే

మాస్కు లేని ప్రయాణం ప్రాణాంతకమే
 • జీవితం ఆగిపోకూడదంటే జాగ్రత్తలు పాటించాలి
 • నిర్లక్ష్యం చేస్తే కొవిడ్‌ ముప్పు తప్పదు
 • కుటుంబ సభ్యులకూ ప్రమాదమే
 • అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు
 • వీలైనంత వరకు సొంత వాహనాల్లోనే ప్రయాణించండి
 • ఏ ప్రయాణమైనా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే

“ఆమె పేరు లక్ష్మి.. భూపాలపల్లి వాసి.. మే 1న కొడుకు నిశ్చితార్థం ఉండటంతో షాపింగ్‌ కోసం ఈనెల 23న కుటుంబమంతా నగరానికి వచ్చారు. 6 గంటల ప్రయాణం. బంధువుల ఇంట్లో రెండు రోజులు ఉండి కార్యక్రమానికి సంబంధించిన షాపింగ్‌ ముగించారు. తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజున లక్ష్మికి స్పల్ప జ్వరం, ఒళ్లునొప్పులు మెదలయ్యాయి. అనుమానంతో టెస్ట్‌ చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. కన్నకొడుకు వేడుకకు హాజరుకాలేకపోతుంది”. ఈ క్లిష్ట సమయంలో లక్ష్మి ప్రయాణం చేయడమే దీనికి కారణం.

“దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ప్రకాశ్‌ రెడ్డి.. తన కంపెనీ పనిమీద అనంతపురం వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికొచ్చిన రెండు రోజులకు తన కూతురు స్వప్నకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇంట్లో ఉన్నప్పటికీ తనకు కరోనా రావడం ఏంటని అనుమానంతో ఏ లక్షణాలు లేని అతడు కరోనా టెస్ట్‌ చేయించుకున్నాడు. అతడికి పాజిటివ్‌ వచ్చింది”.. దీంతో తన ప్రయాణం వల్లే కొవిడ్‌ బారిన పడ్డామని ఆయన ఆవేదన చెందాడు.

‘టికెట్‌ లేని ప్రయాణం నేరం.. అందుకు వెయ్యి రూపాయల జరిమానా…’ మరీ మాస్క్‌, శానిటైజర్‌ లేని జర్నీ.. అది ప్రాణాంతకం. ఇది ఎవరూ చెప్పరు.. మనమే గ్రహించాలి. చాలా మంది కొవిడ్‌ విజృంభణలోనూ ప్రయాణాలు చేస్తున్నారు. శుభకార్యాలు, అంత్యక్రియలు, కంపెనీ పనులు, ఆసుపత్రి ఎమర్జెన్సీలు.. ఇలా అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. కానీ ఆ జర్నీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా కొవిడ్‌ వైరస్‌ బారిన పడుతున్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని సైతం రిస్క్‌లో పెడుతున్నారు. ఇప్పుడు ప్రయాణంలో మాస్క్‌లు,శానిటైజర్లే ఆయుధం.. ఇప్పుడు వాటిని తమ వెంట తీసుకెళ్లకపోతే.. తమ ప్రాణాలకే కాదు ఇతరుల ప్రాణాలకు ముప్పే. దీంతో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తమ వెంట మాస్క్‌, శానిటైజర్‌ ఉండాల్సిందే.. లేకపోతే కొవిడ్‌ను కొని తెచ్చుకున్నట్లే..!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

 • మొదటగా ప్రయాణం అవసరమా? తప్పదా? అని ఆలోచించుకోవాలి. ఒకవేళ అత్యవసరం అనుకుంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
 • ప్రయాణం ఎన్ని రోజులు? ఎవరిని కలవాలి? అనే విషయాలపై క్లారిటీ ఉండాలి. అందుకు సంబంధించిన అపాయింట్‌మెంట్స్‌ చూసుకోవాలి. వీలైనంత తక్కువ సమయంలో పని ముగించుకునేలా ప్లాన్‌ చేసుకోవాలి.
 • ప్రయాణం మొదలవడానికి ముందు మనం వాడే వస్తువులన్నీ వెంట తీసుకెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇతర వస్తువులను వినియోగించొద్దు.
 • జర్నీలో మెడిసిన్‌ అందుబాటులో ఉంచుకోవాలి.
 • తాజా పండ్లు, ఇమ్యూనిటీ పెంచే డ్రైఫ్రూట్స్‌ కచ్చితంగా వెంట ఉండాలి.

ప్రయాణంలో..

 • బస్సులు, రైలులో ప్రయాణం చేసే సమయంలో మరింత కేర్‌ఫుల్‌ గా ఉండాలి. ప్రభుత్వం శానిటైజేషన్‌ ప్రక్రియ చేపడుతున్నప్పటికీ.. మన జాగ్రత్తగా వెంట శానిటైజర్‌ తీసుకెళ్లాలి.
 • మాస్క్‌లు ఎక్కువ సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్‌ శానిటైజర్‌ వెంట ఉండాలి.
 • ఏదైన వస్తువును తాకినప్పుడు వెంటనే చేతులను శుభ్రం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ముక్కు, నోరును తాకకూడదు.
 • బస్సు. క్యాబ్‌, షేర్‌ ఆటోలను వీలైనంత వరకు బంద్‌ చేయాలి. సొంత వాహనాల్లోనే ప్రయాణం చేయాలి. అవి లేని క్రమంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
 • మాస్క్‌లు కిందకు తీయడం మళ్లీ పెట్టుకోవడం..కో ప్యాసింజర్స్‌తో మాట్లాడటం చేయకూడదు.
 • రద్దీలేని వాహనాల్లోనే ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
 • ఆకలిగా ఉన్న సమయంలో బయటిఫుడ్‌ను తీసుకోకుండా వెంట తీసుకెళ్లిన ఫుడ్‌ను తినాలి.
 • పెన్‌ కూడా ఇతరులది వాడకూడదు.
 • షాపింగ్‌ చేసే సమయంలో.. కుటుంబం అంతా కాకుండా ఇద్దరు మాత్రమే వెళ్లేలా ప్లాన్‌ చేసుకుంటే మంచిది. వీలైనంత వరకు అక్కడి వస్తువులను ముట్టుకోకుండానే త్వరతగతిన షాపింగ్‌ ముగించాలి.

ఇంటికొచ్చాక..

 • ప్రయాణం ముగిసి.. ఇంటికెళ్లాక ఫుట్‌వేర్‌తో ఇంట్లోకి వెళ్లకూడదు.
 • నేరుగా బాత్‌రూంలోకి ధరించిన బట్టలను వేడినీటిలో డెట్టాల్‌ వాటర్‌ కలిపి నానబెట్టాలి. అనంతరం వేడినీటితో స్నానం చేయాలి. ఆ రోజు ప్రత్యేక గదిలో విశ్రాంతి తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడటం చేయకూడదు. కొవిడ్‌ లక్షణాలు లేకున్నప్పటికీ వీలైతే నాలుగు రోజుల వరకు ఇలానే కొనసాగించాలి.
 • రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.

వివాహ షాపింగ్‌ రద్దు చేసుకున్నాం

పెండ్లి షాపింగ్‌ చేయాల్సి ఉంది. అందుకోసం విజయవాడ వెళ్లాలని భావించాం. కానీ ప్రయాణం రద్దు చేసుకున్నాం. కారణం.. కొవిడ్‌ వ్యాప్తి అధికమవడం. షాపింగ్‌ కోసం గంటల తరబడి ప్రయాణం చేయాలి. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. కరోనా సోకితే అస్సలుకే మోసం వస్తుంది. ఫంక్షన్‌కు వెళ్లడం ఉండదు. అందుకే భయమేసి ఉన్న వాటిలో కొత్తవి ధరించి ఫంక్షన్‌కు అటెండ్‌ కావడం ఉత్తమం. -సంగీత, గృహిణి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాస్కు లేని ప్రయాణం ప్రాణాంతకమే

ట్రెండింగ్‌

Advertisement