e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News ఆసియా బాక్సింగ్ : ర‌జ‌త ప‌త‌కంతో స‌రిపెట్టుకున్న మేరీ కోమ్‌

ఆసియా బాక్సింగ్ : ర‌జ‌త ప‌త‌కంతో స‌రిపెట్టుకున్న మేరీ కోమ్‌

ఆసియా బాక్సింగ్ : ర‌జ‌త ప‌త‌కంతో స‌రిపెట్టుకున్న మేరీ కోమ్‌

దుబాయ్ : ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్లో మేరీ కోమ్ ఓట‌మిపాలైంది. రజత పతకంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఎమ్‌సీ మేరీ కోమ్ 51 కిలోల ఫైనల్‌లో కజకిస్తాన్‌కు చెందిన‌ నాజీమ్ కిజాయిబే చేతిలో ఓట‌మిపాలైంది.

38 ఏండ్ల‌ భారతీయ లెజెండ్ త‌నకంటే 11 సంవత్సరాలు చిన్నదైన‌ కజఖ్ ప్రత్యర్థి చేతిలో మ్యాచ్‌ను 3-2తో కోల్పోయింది. రెండు రౌండ్లు నువ్వా-నేనా అన్న‌ట్లుగా సాగాయి. చివ‌రి రౌండ్‌లో క‌జ‌ఖ్ నాజీమ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చ‌డంతో మేరీ కోమ్ ఓట‌మిపాలైంది. ర‌జ‌త ప‌త‌కం గెలిచిన మేరీ కోమ్‌కు దాదాపు 5 వేల అమెరిక‌న్ డాల‌ర్లు ప్రైజ్‌మనీగా ల‌భించ‌నుండ‌గా, నాజీమ్ కిజాయిబేకు 10 వేల అమెరిక‌న్ డాల‌ర్లు అంద‌నున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌కు దారితీసే కీలకమైన మీట్‌లో మేరీ కోమ్ రజత పతకాన్ని సొంతం చేసుకోవ‌డం కొంత ఊర‌ట క‌లిగించే అంశంగా చెప్పుకోవ‌చ్చు.

సెమీస్‌లో మేరీ కోమ్ మంగోలియాకు చెందిన లాట్సాఖాన్ అల్తాంట్ సెట్‌గ్‌ను 4-1 తో ఓడించి ఫైనల్‌కు చేరింది. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్‌కు ఇది రెండో రజత పతకం. మునుపటి ఎడిషన్‌ల‌ నుంచి ఆమె ఐదు బంగారు పతకాల‌ను సాధించింది. మేరీ కోమ్‌పై గెలిచి బంగారు ప‌త‌కం సాధించిన‌ నాజీమ్ కిజాయిబే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, ఆరుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది.

దిగ్గజ భారతీయ బాక్సర్ మేరీ కోమ్‌తోపాటు మరో ముగ్గురు భారతీయులు కూడా ఆదివారం మూడు ప‌త‌కాలు సాధించారు. పూజ రాణి (75 కిలోలు), అనుపమ (+ 81 కిలోలు), లాల్బుట్సాహి (64 కిలోలు) ల‌కు బంగారు ప‌తకాలను చేజిక్కించుకున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

జూలై 4 నుంచి ఇమ్రాన్ ఖాన్‌కు వ్య‌తిరేకంగా పీడీఎం దేశవ్యాప్త ఆందోళ‌న‌

బీఎండ‌బ్ల్యూ నుంచి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. ఆక‌ర్శ‌ణీయ‌మైన డిజైన్‌

నేత‌లు కావాల‌న్న ఆతృత‌లో మిగిలిపోతున్న రైతు స‌మ‌స్య‌లు: స‌ర్దార్ వీఎం సింగ్‌

ఎల్ఓసీపై 3 నెల‌లుగా ఒక్క బుల్లెట్ పేల‌లేదు : జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వ‌ణె

వానాకాలం క‌రోనా వైర‌స్‌తో జాగ్ర‌త్త‌.. ఇవి పాటించండి..!

ఎల్లుండి నుంచి ఎంపీలో అన్‌లాక్ : మార్గ‌ద‌ర్శ‌కాలు వెల్ల‌డి

ఆరేండ్ల క్రితం కేసులో హైకోర్టు తీర్పు.. ధ‌ర్మ‌సంక‌టంలో పిన‌రాయి ప్ర‌భుత్వం

తొలి హిందీ వార్తాపత్రిక ప్రారంభం.. చ‌రిత్ర‌లో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆసియా బాక్సింగ్ : ర‌జ‌త ప‌త‌కంతో స‌రిపెట్టుకున్న మేరీ కోమ్‌

ట్రెండింగ్‌

Advertisement