Sandalwood Oil | చర్మ సౌందర్యం కోసం వాడే అనేక రకాల సబ్బులు లేదా ఇతర సౌందర్య సాధన ఉత్పత్తుల్లో చాలా వరకు శాండల్‌వుడ్ ఆయిల్‌ను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. చందనంతోపాటు మనకు దాని నూనె కూడా విడిగా లభిస్తుంది. కనుక కేవలం చందనాన్నే కాకుండా మనం దాని నూనెను కూడా పలు ఇంటి చిట్కాల్లో ఉపయోగించవచ్చు. శాండల్‌వుడ్ ఆయిల్ మనకు అనేక లాభాలను అందిస్తుంది. ఇది సౌందర్య పరంగానే కాక శరీర పరంగా కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శాండల్ వుడ్ ఆయిల్‌తో పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను సైతం తగ్గించుకోవచ్చు. అనేక చర్మ సమస్యలకు, ఇతర అనారోగ్య సమస్యలకు ఈ నూనె ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని తరచూ వాడాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
శాండల్‌వుడ్ ఆయిల్లో అద్భుతమైన యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ నూనెను రాస్తుంటే చర్మంపై ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. మొటిమలు, గాయాలు, పుండ్లు, దెబ్బలపై ఈ నూనెను రాస్తుంటే ఉపయోగం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఈ నూనెను రాయడం వల్ల చర్మంపై ఉండే మొటిమల మచ్చలు, గాయాల మచ్చలు కూడా తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. శాండల్‌వుడ్ ఆయిల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు సైతం ఉంటాయి. కనుక కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఈ నూనెను రాస్తుంటే కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించుకోవచ్చు. కీళ్లు, మోకాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
శాండల్ వుడ్ ఆయిల్ సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌గా కూడా పనిచేస్తుంది. కండరాలు పట్టేయడం, కండరాల నొప్పులను ఈ నూనెతో తగ్గించుకోవచ్చు. ఆయా నొప్పులు లేదా సమస్యలు ఉన్నవారు శాండల్వుడ ఆయిల్‌ను రాస్తుంటే ఫలితం ఉంటుంది. ఈ నూనెను రాయడం వల్ల నాడులు, కండరాలు ప్రశాంతంగా మారుతాయి. నొప్పులు తగ్గుతాయి. శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారు కండరాల నొప్పులు ఉంటే ఈ నూనెను రాస్తుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే శాండల్ వుడ్ ఆయిల్‌ను తీసుకోవడం వల్ల హైబీపీని తగ్గించుకోవచ్చు. అయితే దీన్ని తాగవచ్చా అని చాలా మందికి సందేహం వస్తుంది. కానీ శాండల్ వుడ్ ఆయిల్‌ను మనం లోపలికి కూడా తీసుకోవచ్చు. కానీ ఏ శాండల్ వుడ్ ఆయిల్‌ను పడితే దాన్ని తాగకూడదు. మార్కెట్లో మనకు ఎడిబుల్ శాండల్ వుడ్ ఆయిల్ లభిస్తుంది. దాన్ని మాత్రమే తాగాల్సి ఉంటుంది. ఆ ఆయిల్‌ను పాలలో లేదా ఇతర పానీయాల్లో కొన్ని చుక్కలు కలిపి తాగవచ్చు. దీని వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
శాండల్‌వుడ్ ఆయిల్‌ను వాడడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడతారు. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారి రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. అయితే ఈ ప్రయోజనాలు కలగాలంటే శాండల్‌వుడ్ ఆయిల్‌ను చేతి మణికట్టు లేదా కాలి మడమలపై మర్దనా చేయాల్సి ఉంటుంది. ఇక ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా శాండల్‌వుడ్ ఆయిల్‌ను కలిపి ఆ మిశ్రమంతో నోటిని పుక్కిలించాలి. ఇలా చేస్తుండడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శాండల్‌వుడ్ ఆయిల్‌ను రాస్తుంటే శరీరంపై ఉండే ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆయిల్‌ను ముఖానికి రాయడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఇలా ఈ నూనెతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.