అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో వచ్చిన చిత్రం దోస్తానా. ఈ సూపర్ హిట్ చిత్రానికి ఇపుడు దోస్తానా 2 సీక్వెల్ తెరకెక్కుతుంది. కార్తీక్ ఆర్యన్, జాన్వీకపూర్, లక్ష్ లాల్వాని లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. హోమో సెక్సువాలిటీ పాత్రలతో సాగే దోస్తానా 2 లో భయంకరమైన అంశాలైతే ఏమీ ఉండవని మేకర్స్ అంటున్నారు. జాన్వీకపూర్ కూడా ఇదే విషయాన్ని చెప్తూ..కార్తీక్ ఆర్యన్ ను ప్రశంసలతో ముంచెత్తింది.
దోస్తానా 2 చూడటానికి సాధారణ హోమో సెక్సువాలిటిలా ఉంటుంది. ఈ పదం చుట్టూ ఇప్పటికీ కొన్ని అపప్రదలున్నాయి. దేశవ్యాప్తంగా ఫాలోవర్లున్న కార్తీక్ ఆర్యన్ లాంటి నటుడు ఇలాంటి పాత్ర చేయడం నిజాయితీగా ప్రశంసించాల్సిందే. హోమో సెక్సువాలిటీ గురించి కాబట్టి.. చాలా మంది యాక్టర్లు ఈ పాత్ర చేయడానికి సిగ్గు పడతారని చెప్పుకొచ్చింది.