మనకు బాగా కావలసిన వాళ్లు అలిగి కూర్చున్నప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒకటి చేసి వాళ్లను నవ్వించేందుకు ప్రయత్నిస్తాం కదా. ఈ పని మనుషులు చేస్తే ఫర్వాలేదు కానీ.. ఒక మిడుత చేస్తే? అదిగో అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అలిగి కూర్చున్న ఒక కుక్క నేలపై పడుకొని కనిపిస్తోంది. అది అలిగి ఉందని దాని మొఖం చూస్తేనే తెలిసిపోతోంది.
దాన్ని నవ్వించేందుకు అక్కడకు వచ్చిన ఒక మాంటిస్ (ఒక రకం మిడుత) ప్రయత్నించింది. దాని ముందు కాళ్లను పైకెత్తి మొఖానికి దగ్గరగా పెట్టుకొని, అటూ ఇటూ ఊగుతూ డ్యాన్స్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు తమ ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. ఈ వీడియోకు లక్షపైగా లైకులు, ౩౦ లక్షలపైగా వ్యూస్ వచ్చాయి. ఇంత కూల్‌గా ఉన్న పురుగు మరొకటి ఉండదని నెటిజన్లు ఆ మిడుతను మెచ్చుకుంటున్నారు. మరెందుకాలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.
Dog is not impressed.. 😂 pic.twitter.com/YOFZuy8gcp
— Buitengebieden (@buitengebieden) September 17, 2022