ముంబై : పెండ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ యువతిని నాలుగేండ్ల పాటు లైంగిక వేధింపులకు గురిచేసి ఆపై ఆమెను మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్ కంప్టీ ప్రాంతానికి చెందిన అతుల్ ప్రభాకర్ ఖుర్పడి (28) అదే ప్రాంతానికి చెందిన యువతి (22)ని పెండ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ దగ్గరయ్యాడు.
ఇక పెండ్లి పేరుతో 2018 అక్టోబర్ నుంచి మార్చి 2022 వరకూ ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆపై బాధితురాలిని విడిచిపెట్టి మరో బాలికను వివాహం చేసుకున్నాడు. ప్రియుడు మోసగించడంతో ఆవేదనకు లోనైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం రాత్రి నాగపూర్లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.