చండీఘఢ్ : పెండ్లి పేరుతో విదేశీ మహిళను లోబరుచుకుని లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని (29) గురుగ్రాం పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 నుంచి గురుగ్రాంలో ఉంటున్న తైనాన్ మహిళ (53) నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం బయటపడింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో నిందితుడు రవీంద్ర విశ్వకర్మను తొలిసారి కలిశానని ఆమె తెలిపారు. సెక్టార్ 52లో మహిళ నివసిస్తున్న పేయింగ్ గెస్ట్ ప్రదేశానికి సమీపంలో నిందితుడు నివసిస్తుంటాడు. మహిళతో పరిచయం పెంచుకున్న నిందితుడు ఆమెను పెండ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు.
పెండ్లి పేరుతో మభ్యపెట్టిన నిందితుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనను పెండ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి చేయడంతో ఆమెను దూరం పెడుతూ మహిళ నెంబర్ను బ్లాక్ చేశాడు. బాధితురాలి పిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు విశ్వకర్మను అరెస్ట్ చేశారు.